ఖాళీ అవుతున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు..
మేడ్చల్ ముచ్చట్లు :ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలకు, జరుగుతున్న అభివృద్ధి చూసి ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఉద్యమకారుడు జిల్లా బిఆర్ఎస్ నాయకులు మంద స్వామి ముదిరాజ్ అన్నారు.బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో శుక్రవారం ముడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు కావడి రవి, ఆనంద్, మంగ సాయి కుమార్ గౌడ్, శ్రవణ్ కుమార్ రంజిత్ చారీ, ఎర్ర మల్లేష్, డప్పు బిక్షపతి, 20మంది యువకులు, బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. విరందరికీ గులాబీ కండువ వేసి పార్టీలోకి
ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ సింగం ఆంజనేయులు,జగన్ గూడా సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పి నాగరాజు, జిల్లా నాయకుడు మురళి గౌడ్, చంద్రకాంత్ రెడ్డి, మంద స్వామి ముదిరాజ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గౌటేగోపాల్, ఎల్లగొని చిత్త గౌడ్, తదితరులు పాల్గొన్నారు.





