మేడ్చల్ ముచ్చట్లు ;తెలంగాణ ఉద్యమకారుడు జిల్లా భారతీయ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మంద స్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో నూతనంగా పార్టీలో చేరిన లక్ష్మాపూర్ గ్రామ యువకులు.బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ముగ్ధులై ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి యువకులు చేరారు.తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ బిజెపి పార్టీ నుండి వచ్చిన యువకులు ఉన్నారు.ఈ కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి,ఎంపీపీ హారిక మురళి గౌడ్, ఎంపీటీసీ నాగరాజు, చంద్రకాంత్ రెడ్డి,మంద స్వామి ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. దాదాపుగా 30 మంది లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యువకులు మల్లారెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యారు.పార్టీలో చేరిన వారిలో ఎనమైన బాలేష్,కటికల చక్రపాణి, జయల పాండు ,అంగడి సదానందం, పులబోయిన భాస్కర్, చింతల అర్జున్, దండు సాయికుమార్, ఎనమైన ముత్యాలు, సాయికుమార్, వట్టెం కరుణాకర్ తదితరులు ఉన్నారు .





