ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి
మేడ్చల్ ముచ్చట్లు: కీసర మండలం, నాగారం మున్సిపల్ ఒకటో వార్డు రాయల్ ఫోర్ట్ హోమ్స్ కాలనీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం నాగారం మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా జరిగింది. కాలనీలో సిసి రోడ్డు శంకుస్థాపన పనుల ప్రారంభించిన కమిషనర్ భాస్కర్ రెడ్డి ని కాలనీ వాసులు శాలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి తో పాటు, మునిసిపల్ సిబ్బంది, రాయల్ ఫోర్ట్ కల్చర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్, కాలనీవాసులు పాల్గొన్నారు.





