
కీసర, జూన్ 25, (మేడ్చల్ ముచ్చట్లు); మేడ్చల్ జిల్లా, కీసర మండల పరిధిలోని కీసర ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న 108 వాహనాన్ని మేడ్చల్ జిల్లా నూతన ప్రొగ్రాం మానేజర్ భూమా నాగేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కీసర ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఉన్న 108 వాహన సిబ్బంది పనితీరును పరిశీలించారు. అత్యవసర సమయంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాలు, వాటి పనితీరును గురుంచి 108 సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర మందుల స్టాక్ రికార్డును పరిశీలించారు, క్షత-గాత్రులకు, రోగాలకు వైద్యం అందిస్తున్నా వైద్య పరికరాలను పరీక్షించి వాటి పనితీరును తెలుసుకున్నారు, కీసర 108 అంబులెన్స్ లో అన్ని రకాల వైద్య పరికరాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయి అని వారు తెలిపారు, కీసర 108 సిబ్బంది పనితీరు బాగుందని మెచ్చుకున్నారు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న డెలివరీ మహిళలకు అంబులెన్స్ లోనే ప్రసవము చేయటం, క్షత-గాత్రులకు సరైన సమయంలో చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన కీసర 108 సిబ్బంది ఈ.ఏం.టి చిత్రం రవి, పైలట్ రాంబాను అభినందించారు.


