ఘట్కేసర్ మున్సిపాలిటీ వివేకానంద యువజన సంఘం వారి ఆధ్వర్యంలో 10వ వార్డులో ఉన్న ఈడబ్ల్యూజే కాలనీ బస్ స్టాప్ ని సుందరికారణ చేసి మొక్కలు నాటి రిబ్బన్ కట్ చేసి పునప్రారంభం చేసిన ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్. ఈ సంధర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మునిసిపాలిటీ వివేకానంద యువజన సంఘం నాయకులను అభినందించారు . ఇలాంటి మంచి పనులు ఇక ముందు కూడా చేస్తూ ప్రతి ఒక్కరికి అదృషంగా ఉండాలని అన్నారు.గతంలో కరోనా సమయంలో వివేకానంద యువజన సంఘం నాయకులు ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో ప్రజలు అదుకున్నారని ఇలాంటి సందేశాత్మక పనులు ముందు చేస్తూ ఉండాలని కోరారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అబ్బాసాని యాదగిరి యాదవ్, కౌన్సిలర్లు బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్, కడుపొల్లా మల్లేష్, కుతాది రవీందర్, ఈ డబ్ల్యూ ఎస్ కాలనీ అభివృద్ధి సంఘం నాయకులు కేశవ పట్నం ఆంజనేయులు, వెంకటయ్య, శశిధరన్, గోపాల్ గౌడ్, సూర్య దేవ్, అనిల్, వంశీ, సుధాకర్, సహదేవ్, ఆనంద్, నజీర్, సురేష్, ఫాయుమ్, పిట్ల విజయ్, శివరాత్రి సురేష్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ ఈడబ్ల్యూజే కాలనీ బస్ స్టాప్ సుందరీకరణ
Leave a Comment Leave a Comment





