ఫోను మాట్లాడుతూ బిల్డింగ్ పైనుండి పడి వ్యక్తి మృతి

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు ;మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బిల్డింగ్ పైనుండి ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన దయానంద్ (32) బోడుప్పల్‌లోని వీరా రెడ్డి నగర్, రోడ్ నంబర్ 13లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో సెట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు అదే బిల్డింగ్‌లో బ్రహ్మన్ గౌండ్ (20) అనే యువకుడితో కలిసి నివసిస్తున్నాడు.

బుధవారం రాత్రి, దయానంద్ బిల్డింగ్ పైభాగంలో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు కాళ్లు జారి కింద పడిపోయాడు. ఆ సమయంలో గౌండ్ బిల్డింగ్ కింద నిద్రలో ఉన్నాడు. ఉదయం లేచి దయానంద్ కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించాడు. అనంతరం బిల్డింగ్ వెనుక భాగంలో అతని మృతదేహాన్ని గుర్తించి, వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు.

ప్రమాదంలో దయానంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.

Share This Article
Leave a Comment