– ఆర్కే పురం వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన సత్కార సభ

మేడ్చల్ ముచ్చట్లు , జూలై 26:
1999లో పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం సాధించిన కార్గిల్ యుద్ధానికి గుర్తుగా నిర్వహించే కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, బీజేపీ తెలంగాణ ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక సత్కార సభ ఆర్కే పురం ఆఫీసర్స్ కాలనీ (వైట్ హౌస్) లో శుక్రవారం ఉదయం నిర్వహించారు .ఈ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ గోపు రమణ రెడ్డి అధ్యక్షతన జరిగింది .కార్గిల్ యుద్ధ సమయంలో దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు.
“వీరుల త్యాగం ఎప్పటికీ మర్చిపోలేము” – గోపు రమణ రెడ్డి
ఈ రోజు ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజు కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు ప్రదర్శించిన ధైర్యం, త్యాగం అద్భుతం. వారిని గుర్తుంచుకోవడం మన బాధ్యత. బీజేపీ తరఫున మేము ఎప్పటికీ వీరుల సేవలకు వందనం తెలుపుతూనే ఉంటాము అని అన్నారు .





వీర జవాన్లకు సత్కారం
ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు రామ్ ప్రసాద్, బి.కె. వైష్ణవ్, ఎస్.బి. రాయ్, హెచ్.సి. పాండే, ఆర్.పి. ఠాకూర్, రమేష్ రాయ్, సురేష్ రాయ్, ఆర్.పి.ఐ. తివారి, ఎం. చౌదరి, ఎస్.ఆర్. శర్మ, లక్ష్మణ్ తివారి, ఎ.కె. సింగ్, విజయ్ మిశ్రా, డి.కె. కృష్ణమూర్తి, ఎం.ఎస్. ఝా, ఎన్.సి. ఘోష్, అవధేష్ మిశ్రా, వి.కె. ఝా, ఆర్.ఎన్. సింగ్, ఆర్.పి.ఐ. గుప్తా, కె.కె. ఝా, ఎ.కె. తివారి లను బహుమతులు, శాలువాలతో సత్కరించారు. వీరుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని గోపు రమణ రెడ్డి పేర్కొన్నారు.
అతిథులుగా హాజరైన ప్రముఖులు
ఈ సత్కార కార్యక్రమానికి అడ్వకేట్ ప్రసన్న నాయుడు, డా. విజయ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, సైనికుల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పలువురు రిటైర్డ్ ఆఫీసర్లు, మహిళా నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం హైటీ కూడా ఏర్పాటు చేశారు.


