మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో అభయ హాస్పిటల్ లో 10 రూపాయల డాక్టర్ ఫీజుతో అందరికి అందుబాటులోకి వైద్యసేవలు అందిస్తున్నామని అభయ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఆంజనేయులు తెలిపారు. పేద కుటుంబాలకు, బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వాళ్లకు, నా వంతు సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ ₹10ఫీజును ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్ర రెడ్డి,చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, కౌన్సిలర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజుల్లో ఎక్కడ చూసిన హాస్పటల్లో బారిగా ఫీజులు వసూలు చేస్తూ పేద, మద్యతరగతులను ఇబ్బంది చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, కానీ 10 రు పీజు అనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన అభయ హాస్పిటల్ యాజమాన్యం ఆంజనేయులుని , హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు, నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్రరెడ్డి మాట్లాడుతూ, ఈ రోజుల్లో పేదల గురించి ఆలోచించి, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.





