వానరసేన యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు:ముడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలోని వానరసేన వినాయక మండపం వద్ద భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయక విగ్రహం వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి దాతలుగా సింగం రాకేష్, తండూరి సతీష్ ముందుకు వచ్చారు.

అన్నదానంలో పాల్గొన్న నాయకులలో యువజన నాయకులు క్యాతం మధుకృష్ణ, మాజీ సర్పంచ్ సింగం ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ నాగరాజు,కటికల గోపి,గ్రామ యువకులు కటికల రజిత్, తడెం రాజు, భట్టు వెంకటేష్, అప్పాల శ్రీను, కటికల జనార్దన్,చాడ షావుకారి, తాటికొండ రాము ఉన్నారు.స్థానిక కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అన్నదాన ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించగా, పాల్గొన్న భక్తులు నిర్వాహకులకు ఏర్పాట్లకు సంతోషం వ్యక్తం చేశారు.

Share This Article
Leave a Comment