
మేడ్చల్ ముచ్చట్లు : మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని నాగులూరు చెరువు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా దారుణ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దుండిగల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (31), వెస్లీ (7) చెరువులో గల్లంతయ్యారు. ఆటోలో చెరువుకు చేరుకున్న వీరు చీకట్లో బండరాయి అడ్డురావడంతో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మునిగిపోయారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ బృందం ఉదయం నుండి గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


