రోడ్డు మరమ్మత్తులు చేయండి సారు..

Telangana Chowrasta
1 Min Read
ప్రమాదకరంగా రోడ్డు

మేడ్చల్ ముచ్చట్లు: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నూతన్‌కల్ నుండి రాయిలాపూర్ వెళ్లే రహదారి గుంతలతో నిండిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బైకుపై వెళ్తున్నవారు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని మాదారం, శ్రీరంగవరం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“ఎవరైనా గమనించకుండా ఆ గుంతల్లో పడితే ఆసుపత్రి పాలు కావడం ఖాయం” అని ప్రజలు చెబుతున్నారు. రోడ్డు మరమ్మత్తులు తక్షణం చేపట్టాలని, ప్రమాదాలు జరగకుండా కమిషనర్ సార్ దృష్టి సారించి తక్షణమేగుంతలను పూడ్చి పనులు పూర్తి చేయాలని ప్రజలు మా బాధలు పట్టించుకోండి సారు అంటూ స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment