ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు

Telangana Chowrasta
0 Min Read

మేడ్చల్ ముచ్చట్లు: మూడు చింతలపల్లి మున్సిపల్ కమిషనర్  ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య మహాకవి, ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ – “కాళోజీ గారు తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. ఆయన ఆలోచనలు, కవితలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.ప్రముఖ కవి, ఉద్యమకారుడిగా కాళోజీ గారి చేసిన కృషిని స్మరించుకుంటూ పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ ఉష , ఆర్‌.ఓ. రామ్మోహన్, బిల్ కలెక్టర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment