శామీర్ పేట లో మోహార్రం పండుగ;దర్శించుకున్న నాయకులు

Telangana Chowrasta
1 Min Read

శామీర్ పేట లో మోహార్రం పండుగ ను పురస్కరించుకుని పీర్లను శామీర్ పేట జెడ్పీటీసీ అనితా లాలయ్య, మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ లు దర్శించు కున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా జెడ్పీటీసీ అనితా లాలయ్య, మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, అఫ్జల్ ఖాన్ లు మాట్లాడుతు తెలంగాణ లో ఏ పండుగలనైనా ప్రజలందలరు సోధర భావం తో జరుపుకుంటారని, తెలంగాణ గంగా జమున కల్చర్ మరింత బలోపేతం కావడానికి ఇదే గట్టి పునాది అని అన్నారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు మోహార్రం పండుగ మహ్మద్ ప్రవక్త మనువలు హసన్ హుస్సేన్ ల త్యాగానికి గుర్తు గా చేసుకుంటారని,చివరి మూడు రోజులు,లేక రెండు రోజుల ఉపవాసం ఉండటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనితా లాలయ్య, విలాసాగరం సుదర్శన్, అఫ్జల్ ఖాన్ ల తో పాటు రైతు సహాకార సంఘం ఉపాధ్యక్షులు ఐలయ్య యాదవ్,ఎంపిటిసి డపు సాయి బాబా, డైరెక్టర్ భూమి రెడ్డి, షేక్ చాంద్ పాషా, మహ్మద్ ఇర్ఫాన్ ,నిరుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment