

.
జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ 25 వ డివిజన్ లో భూగర్భ డ్రైనేజి పనులు మేయర్ మేకల కావ్య చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు. 25 వ డివిజన్ పాతబస్తీలో మున్సిపల్ సాధారణ నిధులు 5 లక్షలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజి పనులను మేయర్ మేకల కావ్య శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 25 వ డివిజన్ కార్పొరేటర్ జమల్పూర్ నవీన్, వార్డు కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


