

ఆర్టీసీ ని ప్రభుత్వ రంగ సంస్థ గా ప్రకటించడంతోపాటు రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిఎం కేసిఆర్ చిత్ర పటానికి బుధవారం శామీర్ పేట లో ని వైఎస్సార్ చౌరస్తా వద్ద కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు, దేశానికి మేలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటు పరం చేస్తు ప్రజలకు మొట్టికాయలు వేస్తుంటే కేసిఆర్ ప్రైవేటు గా ఉన్న సంస్థలను ప్రభుత్వం లో కలపటం ద్వారా చారిత్రాత్మక పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఇపుడైనా ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారో సునాయాసంగా అర్థం చేసుకోవచ్చని అఫ్జల్ ఖాన్ తెలిపారు.ఆర్టీసీ ని ప్రభుత్వ రంగ సంస్థ లో కలపటం ద్వారా ద్వారా దాదాపు 43 వేల కుటుంబాలకు మేలు జరుగుతుందని, రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ ప్రజలకు ఎప్పటి కి గుర్తుండి పోతారని అఫ్జల్ ఖాన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయ దుందుభి మ్రోగిస్తుందని అఫ్జల్ ఖాన్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు మేడి రవి, వార్డు సభ్యులు సత్యనారాయణ,వజ్జల మురళి, దూడల శ్రీకాంత్ గౌడ్, నవీన్ ముదిరాజ్,ఉమ్మర్, మహ్మద్ ఇలియాస్, కందుల శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు


