ఓల్డ్ మల్కాజ్గిరిలో పలు ప్రదేశాలలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన

Telangana Chowrasta
1 Min Read

మల్కాజ్గిరి ; ఓల్డ్ మల్కాజ్గిరిలో పలు ప్రదేశాలలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటించారు . పలు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు . ముఖ్యంగా మల్కాజ్గిరి చౌరస్తా వద్ద మసీదు రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత ఎ ఈ శ్రీకాంత్, రజనీకాంత్ కు సూచించారు . రోడ్డు బాలేక పోవడం వల్ల బస్సులు ఒకవైపే నుంచి వెళ్తూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని,సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వెట్ మిక్స్ తో మరమ్మతులు చేపడతామని, వర్షాలు తగ్గగానే రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు . ఓల్డ్ మల్కాజ్గిరి వ్యాయామశాల వెనకనున్న నాలా ను యుజిడి పైప్ లైన్ మాదిరిగా మార్చాలని హెచ్ఎంఎండబ్ల్యు ఎస్, ఎస్ బి అధికారులకు సూచించడం జరిగినది. టిఎస్ఎస్పిసిడిఎల్ ఏడి యాదగిరినీ కలిసి రాజీవ్ గాంధీ నగర్, సర్దార్ పటేల్ నగర్, బాల సరస్వతి నగర్ తదితర ప్రదేశాల్లో కరెంటు కొత్త పోల్స్ వేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో యాకుబ్ రెడ్డి, చారీ, ప్రదీప్, మహేందర్, సుబ్బారావు, సునీల్, జిహెచ్ఎంసి ఏ ఈ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర రజనీకాంత్, రమేష్, ఏడి యాదగిరి, లైనయిన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రావు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment