జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో సమావేశం

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో పోలీస్ స్టేషన్ సిఐ సీతారాం సమావేశం నిర్వహించారు. మీడియా ముసుగులో కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమాజానికి వాస్తవాలను అందజేయాలని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తే సహించేది లేదన్నారు. అటువంటి వారిని గుర్తించి సెక్షన్ 228 ఏ ప్రకారం నోటీసులు అందజేస్తాం అన్నారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తూ ప్రజల్లో ఆందోళన కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మంచి కథనాలు రాయాలని సూచించారు. విలేకరుల ముసుగులో కొందరు నకిలీ లు తిరుగుతున్నారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు  అనిల్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ రెడ్డి,ఇద్రీస్ అలీ లక్ష్మణ్ పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment