మేడ్చల్ ముచ్చట్లు అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సత్వర చర్యలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రభుత్వ పథకాలు అందేలా సత్వర చర్యలు, గృహలక్ష్మి పథకం కింద నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక కట్టుదిట్టంగా చేయాలనీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏల సర్ధుబాటు పట్ల కలెక్టర్ అమోయ్ కుమార్ అభినందించిన సీఎస్ శాంతికుమారి. సీఎస్ శాంతికుమారి స్పందిస్తూ జిల్లాలో వీఆర్ఏలను సర్దుబాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ ను అభినందించారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అన్ని రంగాల్లో పురోగతి ఎంతో బాగుందని అదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేయాలని ఈ విషయంలో కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేస్తున్నారని సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, కారుణ్య నియామకాలు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు, సలహాలను పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అమలు పరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా కారుణ్య నియామకాలకు సంబంధించి 44 మందికి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ సిఎస్ కు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఆసరా పెన్షన్లును తెలంగాణకు హరితహారం కింద ఈనెల 26న జిల్లాలో 70 వేల మొక్కలు నాటేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. దీనికై ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బీసీ, మైనారిటీలకు ఆర్థిక మద్దతు పథకం కింద అర్హులైన వారికి వర్తింపచేసినట్లు కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారికి తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



