మేడ్చల్ గడ్డ మల్లారెడ్డి అడ్డా ;మంద స్వామి ముదిరాజ్

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి గెలుపు ఖాయం

ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తంచేసిన మంద స్వామి
ముదిరాజ్

మేడ్చల్ ముచ్చట్లు ;మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల తెలంగాణ ఉద్యమకారుడు మంద స్వామి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మల్లారెడ్డికి మరోసారి అవకాశం వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ తొలి జాబితా ప్రకటించిన దాంట్లో మేడ్చల్ ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి పేరు రావడంతో మంత్రి పేరు ప్రకటించడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా మంద స్వామి ముదిరాజ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఆయన అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డిని కార్యకర్తలు నాయకులు సమిష్టిగా గెలిపించుకుంటామని మేడ్చల్ గడ్డ మల్లారెడ్డి అడ్డా అని మంద స్వామి ముదిరాజ్ అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి పేరు ప్రకటించడం పట్ల కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment