పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: చంద్రారెడ్డి

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా రాంపల్లీ లోని శిల్పా పార్కు  లో నాగరం మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రా రెడ్డి  1100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా మంచి రేవులలో కోటిమొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా రాంపల్లి లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేందర్ కుమార్, వైస్ చైర్మన్ బండారి మల్లేశ్ యాదవ్, మేనేజర్ చంద్రశేఖర్, డి.ఈ రఘు, కౌన్సిలర్స్ నగేష్ గౌడ్, గోపు కళావతి, బిజ్జా శ్రీనివాస్ గౌడ్, బి ఆర్.యస్.పార్టీ నాయకులు, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ :దినేష్

Share This Article
Leave a Comment