పోలీసులకు సవాలుగా మారిన వరుస దొంగతనాలు
మేడ్చల్ ముచ్చట్లు: కీసర మండలం రాంపల్లి ఒకటో వార్డు రాయల్ ఫోర్ట్ హోమ్స్ అసోసియేషన్ కాలనీలో ఒకేరోజు రెండు రెండు దొంగతనాలు జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు, ఇంటి యజమాని రామకృష్ణ వివరాల ప్రకారం అతను తమ బంధువుల ఇంటికి వెళ్ళాడని, ఉదయం వెళ్లి మరుసటి రోజు సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు గెడ విరిగి ఉండడం గమనించి లోపల వెళ్లి చూసేసరికి బీరువా బద్దలు కొట్టి బీరువాలో ఉన్నా సుమారు మూడు తులాల బంగారం, సుమారు 15 తులాల వెండి దొంగతనం జరిగిందని, అదే కాలనీకి చెందిన మరొక ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు లేకపోవడంతో దొంగలించ లేకపోయారని తెలిపారు, ఇంటి యజమాని వెంటనే అదే రాత్రి పోలీసులకి ఫిర్యాదు చేయగా, ఉదయాన్నే సంఘటన స్థలానికి కీసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ పోలీస్ సిబ్బందితో వచ్చి ఇంటి యజమాని నుంచి వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. అనంతరం అదే రోజు సాయంత్రం కాలనీవాసులు సమక్షంలో దొంగతనాలు, నేరాల గురించి కాలనీ నివాసులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ ప్రవీణ్ రాజు, జనరల్ సెక్రెటరీ పరమేష్, ట్రెజరర్ ఆనంద్ నాదన్, ఆర్గనైజింగ్ సురేష్, కాలనీ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
మేడ్చల్ ముచ్చట్లు
రిపోర్టర్ : ఎస్ దినేష్ కుమార్.






