మేడ్చల్ ముచ్చట్లు :ఘట్కేసర్లో చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు.ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోన్ని మంగళసూత్రాన్ని గుంజుకొని పరారయ్యాడు దొంగ .ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారెడ్డి గూడ చౌరస్తాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మూడున్నర తులాల బంగారం చైన్‌ను దొంగ అపహరించాడు. బాధితురాలు కల్వకుంట్ల మంజుల (52) ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా హన్మకొండలో విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో శివారెడ్డి గూడ చౌరస్తాలో బస్ స్టాండ్‌లో బస్ కోసం మంజుల ఎదురు చూస్తున్నారు. అక్కడకు వచ్చిన ఓ దొంగ.. కంట్లో కారం కొట్టి మంగళ సూత్రం దొంగలించి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పరారయ్యాడని బాధితురాలు తెలిపారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



