- మఫ్టీలో ఉన్న పోలీస్ విధ్యార్ధిణి పై చేయి చేసుకోవడం దారుణం
- పోలీసులు అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
- మేడ్చల్‌ల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు
మేడ్చల్ ముచ్చట్లు : విధ్యార్థులంటే పోలీసులకు లెక్కే లేదని, అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఎబీవీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మేడ్చల్‌ల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ విధ్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఎబీవీపీ కార్యకర్తలు మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలో పేద విధ్యార్తులకు సౌకర్యవంతంగా ఉండేలా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలికిన మంత్రి మల్లారెడ్డి ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు, నియమకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల బతుకులు ఆగమైతున్నాయని మండిపడ్డారు. డిఎస్సీ నోటిఫికేషన్ నిశ్వాస కమిటీ తెలిపిన నివేధక కంటే 22 వేల పోస్టుల తగ్గించి, కేవలం 13వేల 5వందల పోస్టులను అసెంబ్లీలో ప్రకటించడం, మళ్లీ వాటిని కుదిస్తు 6612 పోస్టుల టీచర్ పోస్టుల నియమకాలు చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వ దివాళుకోరు తనానికి, వైఫల్యానికి నిలువెత్తు నిధర్శనమని ఏబీవీపీ కార్యకర్తలు ఒంటికాలుపై లేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను అన్యాయం చేసే కుట్ర పన్నుతోందని, ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకనే తప్పుడు నివేదికలతో తప్పుడు నోటిఫికేషన్లు ఇస్తూ నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తుందని నిలదీశారు.
ఏబీవీపీ మహిళా కార్యకర్తపై పోలీస్ దాడి:
- మేడ్చల్‌ల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చిన ఏబీవీపీ కార్యకర్తల్లోని ఓ మహిళ పై మఫ్టీలో ఉన్న పోలీస్ చేయిచేసుకోవడం పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పడు ఉన్న పోలీసులు కూడా ఒకప్పుడు విధ్యార్థులని మరిచారా అంటు నిప్పులు చెరిగారు. గూండాల పట్లగూడా ఇంత నీచంగా వ్యవహరించరని, ఈ సంఘటన మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్ తలదించుకునే రోజని ఎబీవీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆశ్రోశం వెల్లబుచ్చారు.




