మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ ముచ్చట్లు: ఈనెల 15 న భారతీయ వాయుసేన క్లారికల్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ర్యాలీ
జిల్లాలోని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.భారతీయ వాయుసేనలో అగ్నిపథ్ పథకం లో క్లారికల్ ఉద్యోగాల భర్తికి ఈనెల 15వ తేదీన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఓపెన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీ కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువకులకు మాత్రమేనన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌లో సెలక్షన్ అయిన అభ్యర్థులకు నాలుగు సంవత్సరాల తర్వాత 25 శాతం మందికి వాయిసేనలో ప్రేరణ క్రింద తిరిగి కొనసాగించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈనెల 15 న బేగంపేటలోని ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ , ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జరిగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విద్యార్హతల ధ్రువవ పత్రాలతో హాజరుకావాలని కోరారు. పోస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ htt://agnipathvayu.cdac.in /AV / ద్వారా సంప్రదించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు.



