
మేడ్చల్ ముచ్చట్లు; మల్కాజ్గిరి ప్రాంతంలో 60 వేలకు పైగా మాజీ సైనికులు ఉంటున్నారని హానరీ కెప్టెన్ అవదేస్ మిశ్రా వెల్లడి. భారీ సంఖ్యలో మాజీ సైనికులతో కలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లి చేరుకున్న గోపురమన రెడ్డి టీం.గోపు రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ సైనికులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లి చేరుకొని మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి దరఖాస్తు ఫారం నింపి ఫారం ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు భారత్ మాతాకీ జై నినాదాలతో ఎమ్మెల్యే అభ్యర్థి ఫారం నింపి ఇవ్వటం జరిగింది. గోపు రమణారెడ్డి మాట్లాడుతూ ఆర్మీలో 20 సంవత్సరాల పని చేశాను ఈ ప్రాంతంలో దాదాపు 60 వేల మందికి పైగా మాజీ సైనికులు ఉన్నారు, 150,000 వేలకు మందికి పైగా ఇతర అనేక రాష్ట్రాలకు చెందిన వారు,ప్రత్యేకించి గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఉండటం విశేషం. జన్ ఔషధీ ద్వారా దాదాపు 70000 పైగా మల్కాజ్గిరి ప్రాంతంలో పీఎం జాన్ ఔషధ వల్ల లబ్ధి పొందుతున్న వారు ఉండటం అది కలిసి వచ్చే అంశం అని గోపు రమణారెడ్డి వర్గం తెలియజేస్తున్నారు .మల్కాజ్గిరి ప్రజల కోసం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో అనేక జన్ ఔషధీ కేంద్రాలు స్థాపించి, ప్రజలకు 50 నుండి 90% తక్కువ ధరలకే అందిస్తూ వేలాది మంది ప్రజలను ఆకట్టుకోవటం విశేషం. నిరంతరం ప్రజల మనిషిగా ప్రజా నాయకుడిగా ప్రజా మనిషిగా సమాజ సేవకుడిగా అనేక కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ పార్టీ కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ తో ప్రతిచోట అన్నా పలికే వ్యక్తిగా తో మందికి ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి. ఉచితంగా మందులు పంపిణీ చేసిన వ్యక్తి అని వేలాది మందికి ఆరోగ్య హెల్త్ క్యాంపులు పెట్టి వేలాది మందికి ఫ్రీగా అద్దాలు ఇవ్వటం ఇచ్చారన్నారు . అన్నా అంటే పలికే వ్యక్తిగా గోపు రమణారెడ్డి గారిని మల్కాజ్గిరి ప్రజలు దీవిస్తున్నారు, గోపు రమణారెడ్డి గారికి ఈసారి మల్కాజిగిరి టికెట్ తప్పకుండా వస్తుందని, తప్పకుండా టికెట్ ఇచ్చేదానికి తోడ్పాటు చేస్తారని పూర్తిగా నమ్ముతున్నానని గోపు రమణారెడ్డి అనుచరులు తెలియచేస్తున్నారు. మల్కాజ్గిరి ప్రాంతంలో దాదాపు 40 వేలకు పైగా రెడ్డి కులస్తులు ఉన్నారని వారి పూర్తి మద్దతు వారికి కుంటుందని బిజెపి, కాంగ్రెస్ నుండి గాని రెడ్డి కులం అభ్యర్థి లేకపోవడం కలిసి వచ్చే అంశం అని, అది సైనికునిగా సానుకూలత, అందరినీ కలుపుకొని పోవడం తత్వం, సైనికుని ఉండవలసిన అన్ని గుణాలు ఉండటం, సిన్సియర్, హానెస్ట్, హార్డ్ వర్కర్, నిజాయితీ గా పనిచేసే తత్వం ఇలాంటి అనేక గుణాలు కల వ్యక్తిని మల్కాజ్గిరి అభ్యర్థిగా నింపితే మంచి మెజార్టీతో గెలుస్తానని గోపురమణారెడ్డి అనుచరులు ధీమా వ్యక్తం చేశారు.గోపు రమణారెడ్డి వెంట కెప్టెన్ ఔదేస్ మిశ్రా, డీకే సింగ్, ప్రమోద్ మిశ్రా, రాజేశ్వరరావు , పాండే, ఓకే సింగ్, భార్గవ్ రాజ్, మాజీ సైనికులు, అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్యే దరఖాస్తు ఫారం నింపి ఇచ్చారు .



