ఘట్కేసర్ మునిసిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ వాటర్ మాన్స్ తో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గత కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు షామిర్ పెట్ చెరువులో వరద ఉద్రిక్తత పెరిగి చెరువు యొక్క నీటి తాకిడికి ప్రక్కనే ఉన్న మీషన్ భగీరథ పైప్ లైన్ పూర్తిగా దెబ్బతినడంతో మేడ్చల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా సుమారు 10 నుండి 15 రోజులు నిలిచిపోతుందని, ఘట్కేసర్ మునిసిపాలిటీ పట్టణ ప్రజలకు నీటి సమస్య ఉండకుండా అందరూ తగు జాగ్రత్తగా తీసుకొని మినీ మోటర్ పంపు ద్వారా, ట్యాంకర్ ద్వారా అవసరం ఉన్న ప్రజలు నీరును అందించాలని తెలుపుతూ, మున్సిపల్ పట్టణ ప్రజలు సైతం ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకొని తమ తమ వార్డు కౌన్సిలర్లకు, వాటర్ మాన్ లకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కమిషనర్ ఎండి సాబేర్ అలీ, మున్సిపల్ మేనేజర్ అంజి రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్, వాటర్ మ్యాన్లు, తదితరులు పాల్గొన్నారు.



