జిల్లా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు : సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతాయిపల్లి సమీకృత జిల్లా అధికారుల కార్యాలయం ఆవరణలో జరిగే జాతీయ పతాకావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. జాతీయ సమైక్యత దినోత్సవంలో భాగంగా ఈనెల 17న ఆదివారం ఉదయం 9 గంటలకు ముఖ్య అతిధి, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కావాలని కలెక్టర్ కోరారు.

Share This Article
Leave a Comment