పంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణి చేసిన తీన్మార్ మల్లన్న

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు ; శామీర్ పేట మండలం లోని గ్రామ పంచాయతీ కార్మికులతో అలియాబాద్ లోని సంగీత్ ఫంక్షన్ హాల్లో రైట్ టు రికల్ కార్యక్రమం తీన్మార్ మల్లన్న నిర్వహించరు.అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులకు నిత్యావసరం వస్తువులను పంపిణి చేశారు.ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మాకు మేడ్చల్ నియోజకవర్గం లో మద్దతు తెలిపితే నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న దృశ్యం

అదేవిధంగా ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ఎన్నికల సమయంలో బడులు కట్టిస్తాం, గుడులు కట్టిస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని మేనిఫెస్టో ప్రజలకు చూపించి ఓట్లు వేయించుకుంటారు కానీ ఎన్నికల్లో గెలిచాక మీ సమస్యలు ఎవ్వరు పట్టించుకోరు అలాంటి పని చేయని నాయకులకు కోసమే ఓటు వాపసు తీసుకునే హక్కు ప్రజలకు కల్పించాలనే ఉద్దేశం తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మేడ్చల్ నియోజకవర్గం లో మంత్రి మల్లారెడ్డి తో 500 కోట్లు ఖర్చు పెట్టిస్తా, మైలపోలు తీస్తా అని హెచ్చరించారు. మల్లారెడ్డి లాంటి భూ కబ్జా దారులకు ఓటు వేసి మీ జీవితాలను తాకట్టు పెట్టొద్దు అన్నారు. ఇలాంటి దగకోరు నాయకులకు మీ అమూల్యమైన ఓటు తో సమాధానం చెప్పాలన్నారు.

కార్మికులతో మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న
Share This Article
Leave a Comment