మేడ్చల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామం లోని రాములగుట్ట ప్రతిష్ట ఉత్సవాలలో పాల్గొన్నారు.వేద పండితుల మంత్రాలు,భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రతిష్ట కార్యక్రమంలోని పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ట చేసిన పంచముఖి హనుమంతుని దేవాలయం,శివాలయం తో పాటు రాములవారి గర్భగుడిని దర్శించుకున్నారు.ఈ పూజా కార్యక్రమాల్లో చామకూర మహేందర్ రెడ్డి తో పాటు మండల,నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





