ఉప్పల్; కేసిఆర్,కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ అధ్వర్యంలో టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మకి శవ యాత్ర చేసి, దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.
నిన్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ని సందర్శించిన రేవంత్ రెడ్డి, కేసిఆర్ కేటీఆర్ కి పిండం పెడుతా, అని మాట్లాడిన రేవంత్ రెడ్డి.
ప్రశ్నించే గొంతు అని మల్కాజ్గిరి ప్రజలను మోసం చేస్తూ..
ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఏమైంది ఇన్ని రోజులు నీ గొంతు మూగ పోయిందా… ముడుచుకుపోయిందా అని రామ్మోహన్ ఘాటుగా విమర్శించారు.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి పుండాకోర్ రాజకీయాలు మానుకోవాలని అని హెచ్చరించారు.దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ శ్రేణులు.





