రైతులకు రుణ మాఫీ చేసిన కేసిఆర్ చిత్ర పటానికి శామీర్ పేట పోలాల వద్ద గురువారం కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు రైతు కష్టం తెలిసిన కేసిఆర్ రైతు కు ఏ ఆపద రాకుండా చూసుకుంటున్నారని అన్నారు. దాదాపు 19 వేల కోట్ల రూపాయల రణ మాఫీ చేసి 29 లక్షల పై చిలుకు కుటుంబాలకు లబ్ది చేకుర్చారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అఫ్జల్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు నాయకులు గాజుల సత్యనారాయణ , మహ్మద్ అజ్మత్,ప్రకాష్, భరత్,అనిల్, రైతులు మల్లేష్, అశోక్, సత్యనారాయణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు



