మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ రాంపల్లి ఎక్స్ రోడ్ పూర్తిగా వర్షపు నీటితో జలమయం అయింది. స్థానిక ప్రజల వివరాలు ప్రకారం రాంపల్లి ఎక్స్ రోడ్డు నుండి కుషాయిగూడ వెళ్లే మార్గంలో చిన్నపాటి వర్షం వల్ల డ్రైనేజీ నిండిపోయి రోడ్లమీద వరద నీళ్లు పొంగిపొర్లి ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి వర్షాకాలం ఇదే పరిస్థితి కొనసాగుతుందనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని , సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షాకాలం ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుందని కుషాయిగూడ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ నాగేందర్ తెలియజేశారు.




