మేడ్చల్ ముచ్చట్లు:జూన్ 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను జర్నలిస్టుల పిల్లలు ప్రైవేట్ , ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (H-143) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్,ప్రధాన కార్యదర్శి ఉద్దండ వెంకట్ లు కోరారు. సోమవారం కలక్టర్ కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ ఆధ్వర్యంలో యూనియన్ నేతలు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ స్పందించి సర్క్యులర్ జారీ చేయాలని డీఈఓ కు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లాఅధ్యక్షులు అమరేందర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలల నుండి 50 శాతం స్కూల్ ఫీజు రాయితీ కల్పిస్తున్నామని, ఈ ఏడాది కూడా జిల్లా కలెక్టర్ కు చేసిన ప్రాతినిధ్యం మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లకు సర్కులర్ ఉత్తలు జారీ చేయడమే గాక ఫీజు రాయితీ అమలుపరిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఉత్తర్వుల కాపీని జర్నలిస్టు ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు నాగేంద్ర బాబు,శ్రీరాములు ,కిషోర్,నవీన్ చారి,రఘు,అరుణ్,శ్రీధర్ ,బుచ్చిరెడ్డి మజీద్ తదితరులు పాల్గొన్నారు.



