మానవ సేవే మాధవ సేవ: ఆయుష్మాన్ అడిషనల్ డైరెక్టర్ లింగరాజు

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు :మానసిక రోగులకు సేవ చేయడం నిజమైన మాధవసేవ అని ఆయుష్మాన్ హోమియోపతి రామంతపూర్ ఆసుపత్రి అదనపు డైరెక్టర్ డా. లింగరాజు అన్నారు.బుధవారం రోజున హోమియోపతి ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉప్పల్‌లోని సరస్వతీ నగరంలో గల మీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నాచురల్ సర్వీస్ సెంటర్ (MEANS) ను సందర్శించారు. ఈ సెంటర్ 60 మంది మానసిక రోగులకు సహజ వైద్యాన్ని అందిస్తోంది.ఈ సందర్భంగా డా. లింగరాజు మాట్లాడుతూ, “ఈ సమాజంలో సొంత కుటుంబ సభ్యులే మానసిక రోగులను వదిలించుకోవాలని చూస్తున్నారు. అలాంటి సమాజంలో ఇంత మంది మానసిక రోగులకు ఒకే చోట సహజ వైద్య సేవలు అందిస్తూ, వారికి మళ్లీ సామాన్య జీవితాన్ని తిరిగి అందించే ప్రయత్నం చేస్తున్న జ్ఞాన ప్రకాష్ గారి సేవలు ప్రశంసనీయం,” అని అన్నారు.విద్యార్థులు ఈ సెంటర్‌ను మొదటిసారి సందర్శించారని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి హోమియోపతి సేవలు అందించేందుకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ, “గత 10 సంవత్సరాలుగా ఈ MEANS సెంటర్ గురించి నాకు తెలుసు. మానసిక రోగులకు చికిత్స చేయడం అనేది ఎంతో సవాలుతో కూడిన పని. అలాంటి బాధ్యతను స్వీకరిస్తూ ఈ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయం,” అని అన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ సైకియాట్రిస్ట్ డా. లోకేష్ చౌహాన్, సంస్థ చైర్మన్ జ్ఞాన ప్రకాష్, ఆయుష్మాన్ హోమియోపతి విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment