మున్సిపాలిటీ కేంద్రంలో ఇది పరిస్థితి…👇

మేడ్చల్ ముచ్చట్లు:మూడు చింతలపల్లి మున్సిపాల్టీ పరిధిలో మూడు చింతలపల్లి నుండి ఉద్దమరి వెళ్లే రోడ్డులో ప్రధాన కూడలికి అతిచెరువలో రోడ్డంతా గుంతల మయం అయింది. వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చిన్నపాటి వాహనాలు ఈ గుంతల్లో చిక్కుకుని ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ రహదారి మూడుచింతలపల్లి ప్రధాన కేంద్రాన్ని ఇతర గ్రామాలకు కలిపే మార్గం కావడంతో రోజూ వందలాది వాహనాలు సంచరిస్తాయి. రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
“ఇంత ముఖ్యమైన రోడ్డును అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలం వచ్చి వాహనదారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది” అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖలు వెంటనే రోడ్డును మరమ్మతు చేసి, శాశ్వత పరిష్కారం చూపాలనిప్రజలు కోరుతున్నారు.


