నాగరం లో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

Telangana Chowrasta
1 Min Read

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాగరం పురపాలక సంఘ కార్యాలయములో చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ, నాగారం పట్టణంలో జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భముగా జూన్ 2వ తేది నుండి 22వ తేది వరకు 21 రోజుల పాటు జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని, నాగారం ప్రజలు, ప్రజలు ప్రతినిధులు, అధికారులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్యాలయం మేనేజర్ చంద్రశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment