
మేడ్చల్ ముచ్చట్లు :మేడ్చల్ మున్సిపల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఉదయం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.విఘ్నాలను తొలగించి, విజయాన్ని ప్రసాదించే విఘ్నేశ్వరుడుకి ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు.
ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుని ఆశీర్వాదాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి వంశీ విజయ్, రాష్ట్ర నాయకులు రాగం అర్జున్, జిల్లా నాయకులు లవంగ శ్రీకాంత్, బొజ్జ రాఘవ రెడ్డి, మున్సిపల్ నాయకులు వంశీధర్ రెడ్డి, గౌలికర్ మహేష్, శ్రీపాల్ రెడ్డి, కే. మహేష్, విష్ణు కాంత్, తావుల శివ తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి సందర్భంగా మున్సిపల్ పరిధిలోని భక్తులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై పూజలో పాల్గొనడం విశేషం.


