మేడ్చల్ జిల్లా కాప్రా మండలం చర్లపల్లి ఐజి కాలనీ నుండి చిన్న చెర్లపల్లి వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా జలమయం అయింది. గత సంవత్సరం ఐజి కాలనీ నుండి చిన్న చర్లపల్లి ప్రధాన రహదారిలో ఉండే వంతెన నిర్మాణం ప్రారంభించి ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టలేదని, ఈ మార్గం ప్రమాదకరంగా మారడంతో గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా స్థానిక నాయకులు చొరవ తీసుకొని వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




