జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 36 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను మంత్రి చామకూర మాల్లారెడ్డితో కలిసి మేయర్ మేకల కావ్య అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి కె సి ఆర్ పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు ఒక మేనమామ లాగా రూ.1,00,116 లను కళ్యాణ లక్ష్మీ , షాది ముబారక్ పథకం ద్వారా అందచేస్తున్నారని, కేవలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే గడిచిన మూడేళ్ళలో 908 మంది లబ్దిదారులకు రూ. 9.09 కోట్ల రూపాయలు ఈ పథకం కింద చెక్కుల రూపంలో అందినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనిత, డెప్యూటీ మేయర్ ఆర్ ఎస్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు, లబ్దిదారులు, రెవిన్యూ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




