ఖాళీ అవుతున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు
మేడ్చల్ ముచ్చట్లు; బిఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలకు, మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ మున్సిపాలిటీ గిర్మాపూర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి, లింగం, దశరథ్, కుమార్, ఎల్లం, ఆంజనేయులు తో పాటు 20మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారిని మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించారు.




